నాన్న ప్రజల మనస్సులో కలకాలం నిలిచి ఉంటారు

తన తండ్రి, ప్రియతమ
మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ప్రజల మనస్సుల్లో కలకాలం ఉండిపోతారని వైయస్ ఆర్
కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం నాడు ఫాదర్స్ డే
సందర్భంగా, శుభాకాంక్షలు తెలియచేస్తూ, ట్వీటర్ లో ఆయన తన భావాలను ప్రజలతో
పంచుకున్నారు.

‘‘జీవితంలో ఎంత ఎదిగినా, ఏ స్థాయికి చేరినా మనం నిత్యం
స్మరించుకునేది నాన్ననే. నేనే కాకుండా రాష్ట్రమంతా నా తండ్రిని స్మరించుకుంటుండటం
అదృష్టంగా భావిస్తున్నా. అందరికీ ఫాదర్స్‌ డే శుభాకాంక్షలు. ఆ మహనీయుడు ఎన్నటికీ
మన మధ్యే ఉంటారని, ఉండాలని విశ్వసిస్తున్నాను’’ అని వైయస్ జగన్‌
ట్వీట్ లో పేర్కొన్నారు. 

Back to Top