మీరిచ్చే ప్రతి హామీని నమ్ముతున్నాం

చిత్తూరు: జగనన్నా..మీరు ఇస్తున్న ప్రతి హామీని నమ్ముతున్నాం. ఎందుకంటే మాట మీద ఉండే కుటుంబం మీది కాబట్టి మేం నమ్ముతున్నాం. టమాట రైతులకు ధరల స్థిరీకరణ అన్నది లేక నష్టపోతున్నాం. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మీరిచ్చే ప్రతి హామీని నమ్ముతున్నాం.  పాల రైతులను మోసం చేస్తూ చంద్రబాబు నయవంచనతో విజయ డయిరీని మూయించారు. ఆ ఫ్యాక్టరీని తెరిపిస్తామన్నందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. దేశానికి పల్లెలు పట్టుకొమ్మలు అంటారు. ఈ పంచాయతీలో జరిగే అభివృద్ధిలో కరెంటు బిల్లులు కేంద్రమే కట్టేది. పప్పులాంటి లోకేష్‌ను పంచాయతీ రాజ్‌ మంత్రిని చేశారు. కరెంటు బిల్లులు మా పంచాయతీలో రూ. 70 లక్షలు కడితే మిగతా పనులు ఏలా చేయాలన్నా..సర్పంచ్‌గా నాకు ఉన్న అవగాహన కూడా లోకేష్‌కు లేదు. మహానేత హయాంలో 90 శాతం పక్కా ఇల్లు కట్టించారు. 1994లో ఎన్‌టీఆర్‌ పుణ్యమా అని ప్రభుత్వం ఏర్పడితే బాబు సీఎం అయ్యారు. వాజ్‌పేయి హయాంలో కూడా అలాగే జరిగింది. వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి పోలవరానికి అనుమతులు తెచ్చారు. హంద్రీనీవాకు 80 శాతం పనులు చేపట్టారు. రాజ్యాంగబద్దంగా సర్పంచ్‌ అయిన నాకు ఎలాంటి అధికారాలు ఇవ్వకుండా జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేశారు. ఆ కమిటీలకు ఏం తెలుసు అన్నా..టీడీపీ కార్యకర్తలకే పింఛన్లు ఇస్తున్నారు. ఎందుకంటే వీళ్లకు కూడా పింఛన్లు ఇవ్వకపోతే ఎక్కడ ఓట్లు వేయరో అన్న భయం టీడీపీకి ఉంది. మీ కుటుంబం నుంచి నేను నేర్చుకున్నది విశ్వసనీయత, నిబద్ధత ఈ రెండు నేను నేర్చుకున్నాను. ప్రతి ఒక్కటి నేను గమనిస్తున్నాను. చంద్రబాబుకు మాత్రం ఇలాంటి లక్షణాలు ఎప్పటికి రావు. ఏ రాష్ట్ర నాయకుడు కూడా మీలా ప్రజా సమస్యలను చూసి ఉండరు. లోకేష్‌కు అవగాహన లేకపోవడంతో పంచాయతీ కార్మికులకు జీతాలు ఇవ్వలేకపోతున్నాం. నేను మాట్లాడుతున్నానని నాపై కూడా ఏవైనా కేసులు వేస్తారన్నా..నేను సర్పంచ్‌ అయినప్పుడు నాయుళ్ల ఓట్లు మాత్రమే వేయించుకోలేదు. అందరూ నాకు ఓట్లు వేశారు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం ప్రజలకు చేరాలి. కానీ జన్మభూమి కమిటీలు ఈ పథకాలను పక్కదారి పట్టిస్తున్నారు.
–––––––––––––––––
తప్పుడు కేసులు పెడుతున్నారు:  మురళి, రైతు
అన్నా..నేను రెండు ఎకరాల చెరకు సాగు చేశాను. మరో రెండు ఎకరాల్లో మామిడి పంట వేశాను. ఇందుకోసం రూ.2 లక్షలు బ్యాంకు రుణం తీసుకున్నాను. ఒక్క రూపాయి కూడా రుణమాఫీ కాలేదు. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాపై 20 కేసులు పెట్టారు. ఏలా బతకాలన్నా..మీరు సీఎం అయితే మేం బాగుపడుతామన్నా..
వైయస్‌ జగన్‌: అన్నా..మనం దగ్గరకు వచ్చాం. వీళ్లు పెట్టే తప్పుడు కేసులన్నీ కూడా మారుస్తాం. తప్పుడు కేసులు  అన్నీ కూడా తీసేస్తాం. తప్పుడు కేసులు పెట్టిన అధికారులపై కూడా కేసులు పెట్టిస్తాం.
––––––––––––––––––
మీరు ఒక్కసారి సీఎం అయితే వదలరు ..
అన్నా ..మామిడి తోట ఆరు ఎకరాలు ఉన్నాయి. పంట కోసే సమయంలో రేట్లు తగ్గిపోతున్నాయి. మీరు సీఎం కాగానే ఈ పరిస్థితి మార్చాలన్నా..ప్రతి రైతుకు ఒక్క లక్ష రుణమాఫీ చేయాలని కోరుతున్నాను. మీరు సీఎం..ఒక్కసారి మీరు సీఎం అయితే ఎప్పుటికి మిమ్మల్ని వదలరు. కరెంటు కనెక్షన్లు 5 రోజుల్లోనే ఇప్పించాలి.

వైయస్‌ జగన్‌: ఇక్కడ మామిడి ఫ్యాక్టరీలు అన్నీ కూడా ప్రైవేట్‌ వ్యక్తులవే. వారు చెప్పిందే రేటు..కొనిందే పంట. ఈ పరిస్థితి మారుస్తాం.
–––––––––––––––
మహానేత పాలన మళ్లీ రావాలి:  మునిస్వామి, రైతు
అన్నా..నాకు మూడేకరాల పొలం ఉంది. ప్రతి ఏటా కంప చెట్లే మొలుస్తున్నాయి. నాన్నగారిహయాంలో రుణమాఫీ ప్రకటించారు. అప్పట్లో మాకు రుణాలు తీసుకోలేదు. కానీ అధికారులు మా ఇంటికి వచ్చి రుణాలు లేవు కాబట్టి రూ.5 వేల ప్రోత్సాహం అంటూ ఇచ్చారన్నా..అలాంటి ధైర్యం కావాలన్నా..
––––––––––––––––––––
ముందే సంక్రాంతి వచ్చింది:  శంకర్, రైతు
రైతులు అతి ముఖ్యంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. మూడు రోజుల ముందే మాకు సంక్రాంతి పండుగ వచ్చినట్లు ఉంది. పాలు సరఫరా చేసే అతిపెద్ద జిల్లాలో తగిన ప్రోత్సాహం లేదు. మీరు ప్రతి పాడి రైతుకు లీటరుకు రూ.4 వేలు ఇస్తామన్నారు. గొప్ప విషయమన్నా..మీరు సీఎం అయ్యాక అవును కొనుగోలు చేసేందుకు సబ్సిడీలో రుణం అందిస్తే బాగుంటుంది. 
–––––––––––––––
సబ్సిడీపై పనిముట్లు ఇవ్వాలి:  వాసు, రైతు
అందరు రైతులకు రూ.12,500 ఇస్తామన్నారు. అలాగే ఉపాధి హామీ పథకం రైతులకు మేలు చేసేలా చేపట్టాలి. ఈ ప్రభుత్వంలో పనిముట్లు ఇవ్వడం లేదు. నాన్నగారి మాదిరిగా ఉపాధి నిధులతో పనిముట్లు అందిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. రైతులకు సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలన్నా.. 
  – 
 
Back to Top