'భూములు ఇచ్చిన రైతులు కన్నీరు పెట్టుకున్నారు'

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) సోమవారం లోటస్పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ "రాష్ట్ర ప్రభుత్వం అక్రమమైన ల్యాండ్ పూలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టిందని విమర్శించారు. ప్రభుత్వం ప్రకటించింది మొదలు.. రైతులకు కంటిమీద కునుకులేకుండా పోయిందని అన్నారు. అధికారులను ఉపయోగించి రైతులను భయభ్రాంతులకు గురిచేశారని ఆర్కే ఆరోపించారు. పోలీస్టేషన్ గడప ఎక్కని రైతులను విచారణ పేరుతో హింసించారని మండిపడ్డారు. భూసేకరణ చట్టంలో సవరణలపై చర్చ జరగుతుండగానే.. ఇక్కడ భూమిని సేకరిస్తామని చెప్తున్నారని తెలిపారు. ల్యాండ్ పూలింగ్ చివరి రెండురోజుల్లో రైతులను విపరీతంగా భయపెట్టారని చెప్పారు. భూములను ఇచ్చిన చాలామంది రైతులు ఇప్పుడు కంటనీరు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయని ఆర్కే గుర్తుచేశారు."
Back to Top