ఆత్మ‌హ‌త్య‌లు క‌నిపించ‌వా..!


అనంత‌పురం) రాష్ట్రంలో రైతులు అల్లాడిపోతున్నారు, అప్పుల బాధ భ‌రించ‌లేక ఆత్మ‌హ‌త్య‌లు చేసుకొంటున్నార‌ని ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ఎంత గ‌ట్టిగా వాదించినా, ప్ర‌భుత్వం చెవుల‌కు ఎక్క‌టం లేదు. అస‌లు ఈ రాష్ట్రంలో ఆత్మ‌హ‌త్య‌లు లేనే లేవు, రైతులంతా ఆనందంగా ఉన్నారంటూ అడ్డ‌గోలుగా క‌బుర్లు చెప్పింది. చివ‌ర‌కు బాధ్య‌త గ‌ల ప్ర‌తిప‌క్ష నేత‌గా వైఎస్ జ‌గ‌న్ ... రైతు భ‌రోసా యాత్ర చేప‌ట్టి ఎక్క‌డెక్క‌డ రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకొన్నారో అక్క‌డ‌కు స్వ‌యంగా వెళ్లి పరామ‌ర్శించి వ‌స్తున్నారు. 
ఈ ప‌రిస్తితుల్లో కేంద్ర ప్ర‌భుత్వం నుంచి గ‌ణాంకాల పత్రం విడుద‌ల అయింది.ఇందులో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 632 మంది రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకొన్నార‌ని వెల్ల‌డైంది. తెలంగాణ‌లో ఈ సంఖ్య ఇంకా ఎక్కువ‌గా ఉంది. రెండు రాష్ట్రాల్లోనూ ప్ర‌భుత్వాల వైఫ‌ల్యం ఇక్క‌డ స్పష్టంగా క‌నిపిస్తోంది.  చంద్ర‌బాబు చేసిన రుణ‌మాఫీ మోసం వంద‌లాది కుటుంబాల్లో చిచ్చును రేపుతోంది. స్వ‌యంగా కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన నివేదిక‌లోనే 632 మంది  రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకొన్న‌ట్లుగా ఉందంటే ప‌రిస్థితిని అర్థం చేసుకోవ‌చ్చు. 
కానీ, ఇంత జ‌రిగినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పంద‌న క‌ర‌వైంది. మొక్కుబ‌డిగా వైఎస్ జ‌గ‌న్ చేస్తున్న యాత్ర ను ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు స‌మ‌స్య వెంట ఇంకో స‌మ‌స్య ను సృష్టించి వెళుతున్నారు. ప్ర‌జ‌ల దృష్టిని ప‌క్క‌కు మ‌ళ్లించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు త‌ప్పితే, ఎటువంటి ఉప‌శ‌మ‌న చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం లేదు. 

తాజా వీడియోలు

Back to Top