ఆర్డీవో కార్యాలయం ముట్టడి

పశ్చిమగోదావరి: రాష్ట్రంలో పంటలకు నీళ్లు లేక రైతులు నానా అవస్థలు పడుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. నీరులేక
పంటలు ఎండిపోతుండటంతో పశ్చిమ గోదావరి జిల్లా రైతన్న కన్నెర్ర చేశాడు.
ఎత్తిపోతల పథకానికి నీరు నిలిపేయడంతో రైతులు కొవ్వూరు ఆర్డీవో
కార్యాలయాన్ని ముట్టడించారు. నీటిని నిలిపేయడంపై పెద్ద ఎత్తున నినాదాలు
చేస్తూ ఆర్డీవో కార్యాలయానికి రైతులు తాళం వేసే ప్రయత్నం చేశారు. అన్నదాతను
 పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకొని పరిస్థితి
ఉద్రిక్తంగా మారింది.
Back to Top