మిర్చి రైతుల పరిస్థితి దయనీయం

  • మిర్చి మార్కెట్ యార్డును పరిశీలించిన వైయస్సార్సీపీ నేతలు
  • ప్రభుత్వ అసమర్థత కారణంగా రైతుల అవస్థలు
  • పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని నేతల డిమాండ్ 
  • రైతులకు వైయస్సార్సీపీ అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా
గుంటూరుః ప్రభుత్వ అసమర్థత, చేతగానితనం కారణంగా మిర్చీ రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని వైయస్సార్సీపీ నేతలు అన్నారు. గుంటూరు మిర్చి మార్కెట్ యార్డును నేతలు సందర్శించి ధరలపై రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.  తక్షణమే మార్క్ ఫెడ్ లను రంగంలోకి దించి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. మిర్చి మార్కెట్‌ను సందర్శించిన వారిలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మర్రి రాజశేఖర్‌, ముస్తాఫా, లేళ్ల అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున, అంబటి రాంబాబు తదితరులు ఉన్నారు.

మర్రిరాజశేఖర్
మిర్చి రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఆరుగాలం శ్రమించి వ్యయ ప్రయాసల కోర్చిపండించిన పంటను అమ్ముకునే పరిస్థితి లేదు. సరైన గిట్టుబాటు రాక రైతులు అప్పులపాలై దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వం మొదటి నుంచి నకిలీ విత్తనాలను అరికట్టడంలో విఫలమైంది. ప్రభుత్వంలోని పెద్దలే నకిలీ విత్తనాలను ప్రోత్సహించారు. దీంతో, విత్తనాల్లో మోసపోయి ఆర్థికంగా రైతులు చాలా నష్టపోయారు. దాన్నుంచి తేరుకొని పంట పండించి మార్కెట్ కు వస్తే నిరాశే ఎదురైంది. పోయిన సంవత్సరం క్వింటాలు రూ.15వేలు పలికింది. ఈ ఏడాది ఆరువేలకు కూడ కొనే పరిస్థితి లేదు. మామూలు రకాలు రూ.3వేలే అంటున్నారు. ఎకరాకి 4, 5వేలు లాస్ వస్తోంది. బాబుఎన్నికల ముందు చాలా మాటలు చెప్పారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేస్తాం. గిట్టుబాట ధర తీసుకొస్తాం. ధరల స్థిరీకరణ నిధితో రైతులను ఆదుకుంటామన్నారు. ఏఒక్కటీ చేయడం లేదు. రూ. 3, 4వేలకు మిర్చి అమ్ముకోవడమంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకేమైనా ఉందా. బాబు రైతులను మోసం చేస్తున్నారనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి. ముఖ్యమంత్రి, వ్యవసాయమంత్రి ఈ జిల్లాలోనే ఉంటారు. రైతుల బాధలు నిత్యం పేపర్లో చూస్తారే తప్ప ఒక్కరు స్పందించరు. రైతుల గురించి పట్టించుకోరు. దోచుకుందాం,  దాచుకుందామన్న ధ్యాసే తప్ప అధికార పార్టీ నేతలు రైతులను పట్టించుకోవడం లేదు. రూ. 10వేలు మిర్చీ ధర నిర్ణయించాలి. అప్పుల ఊబిలోంచి రైతులను కాపాడాలి

లేళ్ల అప్పిరెడ్డి
గతంలో పంటల ధరలు తగ్గినప్పుడు ప్రభుత్వాలు మార్క్ ఫెడ్, నా ఫెడ్ లను రంగంలోకి దించి పంటలను కొనుగోళ్లను చూశాం. కానీ, చంద్రబాబుకు రైతుల బాధలే పట్టడం లేదు. వైయస్ఆర్ ప్రభుత్వ సపోర్ట్ ప్రైస్ తో రైతులకు అండగా నిలిచారు. మిర్చి రైతులు ఆత్మహత్యలవైపు మళ్లకముందే వాళ్లలో మనోధైర్యం కల్పించేలా ప్రభుత్వం ముందుకొచ్చి మార్క్ ఫెడ్ ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలి. మిర్చి రైతుల పక్షాన పెద్ద ఎత్తున వైయస్ జగన్ నేతృత్వంలో ఉద్యమిస్తాం.

ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోంది. ఎక్కడ కూడా ప్రభుత్వం సమీక్ష జరపడం లేదు. కల్తీ విత్తనాలతో రైతులు
నష్టపోతే... పీడీ యాక్ట్ పెట్టి వాళ్లను అరెస్ట్ చేసి వాళ్ల దగ్గర్నుంచే రైతులకు పరిహారం ఇప్పిస్తామని హంగామా చేశారు. ఇంతవరకు ఆ పరిహారం ఇవ్వలేదు. వాణిజ్యపంటలు ఎక్కడ కూడ  ధరల నిర్ణాయకసంఘం కమిషన్ పరిధిలోకి రావడం లేదు. ధరల స్థిరీకరణ నిధితో దగ్గరుండి కొనిపించి రైతులను కాపాడాల్సిన బాధ్యతను ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది. మిర్చి రైతుల కష్టాలను అసెంబ్లీలో నిలదీస్తాం. మా నాయకుడు వైయస్ జగన్ ను  యార్డు విజిట్ కూడ పెట్టుకోమని రిక్వెస్ట్ చేస్తాం. రైతులకు అండగా నిలబడడానికి అన్ని విధాల కృషి చేస్తాం.

ముస్తఫా
రైతులకు రుణమాఫీ, వారిని ఆదుకోవడానికి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పి బాబు మోసం చేశారు. కనీసం గిట్టుబాటు అయినా వస్తుందా అంటే అది లేదు. మార్కెట్ తగ్గినా ప్రభుత్వ నిధితో ప్రాసెస్ చేస్తే రైతులు సంతోషంగా ఉంటారు. ఎంతసేపు జపాన్, సింగపూరే తప్ప రైతుల పరిస్థితి గురించి బాబు ఆలోచన చేయడం లేదు. వెంటనే ప్రభుత్వమే పంటను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి. మిర్చి రైతుల గాథపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం.

మేరుగు నాగార్జున
బాబు మాయమాటలతో రైతాంగం విలవిలలాడుతోంది. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను మార్కెట్ లో రోజుల తరబడి పడిగాపులు కాసి రూ.40, 50వేల లాస్ తో వెళుతున్నారు . ప్రభుత్వ అలసత్వం, చేతగానితనం కారణంగానే రైతులకు ఈ దుస్థితి వచ్చింది. రైతులకు అండగా వైయస్సార్సీపీ ముందుంటుంది. వైయస్ జగన్ రైతు పక్షపాతి.

అంబటి రాంబాబు
మిర్చికి గిట్టుబాటు లేక రైతాంగం అల్లాడుతోంది. వైయస్ జగన్ ఆదేశాల మేరకు మిర్చీ యార్డుకు వచ్చి రైతులను పరామర్శించాం. అధికారులతో మాట్లాడాం. మిర్చి రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. పంటలకు గిట్టుబాటు లేక పెట్టుబడి కూడ రాని పరిస్థితి. వ్యవసాయశాఖ మంత్రికి సంబంధించిన వారే నకిలీ విత్తనాలు అమ్మినవారిలో ముద్దాయిలుగా ఉన్నారు. ఇంతవరకు రైతులకు పరిహారం ఇవ్వలేదు. రైతులకు న్యాయం చేసేవిధంగా పోరాడుతాం. తక్షణమే ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధితో రైతులను ఆదుకోవాలి. 
Back to Top