నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి


అనంతపురం: పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ధ్వజమెత్తారు. బెలుగుప్ప మండలంలోని రామసాగరం, దుద్దేకుంట గ్రామాల్లో  ఈదురుగాలులకు దెబ్బతిన్న అరటి, మామిడి తోటలను ఆయన పరిశీలించారు. అకాల వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా వెయ్యి హెక్టార్లలో పంట నష్టం జరిగిందన్నారు. పంట చేతికొచ్చే దశలో వర్షాలు పడడంతో రైతులు నష్టపోయారని, పంట నష్టానికి గురైన రైతులను ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు. గతేడాది పంట నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం అందించలేదన్నారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 70 వేల పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా రాష్ట్రంలో ఏ పంటకు సరైన గిట్టుబాటు ధరను ప్రభుత్వం చెల్లించడం లేదన్నారు. గత కొద్దికాలంలో అరటి రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వమే వారిని ఆదుకొని ఉచితంగా మొక్కలు అందించాలన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు హామీ ఏమైందని ప్రశ్నించారు

తాజా వీడియోలు

Back to Top