ప్ర‌కృతి విపత్తులతో నష్టపోతున్నాం

తూర్పుగోదావరి: పకృతి విపత్తులతో పూర్తిగా నష్టపోతున్నామని, తమను ఆదుకోవాలని అరటి రైతులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి మొరపెట్టుకున్నారు. కొత్తపేట నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో అరటిరైతులు వైయస్‌ జగన్‌ను కలిశారు. ఈ మేరకు వారి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గ పరిధిలని నాలుగు మండలాలు కొత్తపేట, ఆత్రేయపురం, రావులపాలెం, ఆర్మూరు మండలాల్లో భారీగా అరటితోటు సాగుచేస్తామని, సుమారు ఎకరానికి రూ. 1.5 లక్షల ఖర్చు అవుతుందన్నారు. అంతేకాకుండా వెదురుకే లక్ష ఖర్చు అవుతుందన్నారు. ఎదురు వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని, గాలివానలకు పంట నాశనంతో పాటు ఎదురు కూడా రెండు ముక్కలవుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇన్సూరెన్స్‌ పెట్టడంతో నష్టపోతున్నామని, మండలాల వారిగా ఇన్సూరెన్స్‌ ఇప్పించాలని, అదే విధంగా సబ్సిడీపై ఎదురు ఇప్పించాలని కోరారు. రైతుల సమస్యలు విన్న వైయస్‌ జగన్‌ అధ్యయనం చేసి రైతులకు మేలు చేసే నిర్ణయం తీసుకుంటానని చెప్పడంతోసంతోషం వ్యక్తం చేశారు. 
 

Back to Top