ఉపాధి లేక రైతుల వ‌ల‌స బాట‌

- సాగునీరందక ఇబ్బందులు పడుతున్న రైతులు
- ఆదుకోవాల‌ని వైయ‌స్ జ‌గ‌న్‌కు విన‌తి 
విశాఖ‌: వరాహ కాల్వ పూడికతీతలు తీయకపోవడంతో సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు.  ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గురువారం య‌ల‌మంచిలి నియోజ‌క‌వ‌ర్గ రైతులు వైయస్‌ జగన్‌ను కలిసి  తమ సమస్యలు చెప్పు కున్నారు.కనీసం ఒక వరి నాటు కూడా వేసుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. దీంతో  జీవనోపాధి లేక  సుమారు నాలుగు గ్రామాల ప్రజలు వలస పోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.  వైయస్‌ఆర్‌ హయాంలో ఎప్పటికప్పుడు పూడికతీతలు జరిగేవని ఇప్పుడు పట్టించుకోనే నాధుడే లేడని రైతులు ఆవేదన చేస్తున్నారు.  మీరు ముఖ్య‌మంత్రి కాగానే త‌మ భూముల‌కు సాగునీరు ఇచ్చి ఆదుకోవాల‌ని జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌ను కోరారు. వారి స‌మ‌స్య‌లు సావ‌ధానంగా విన్న వైయ‌స్ జ‌గ‌న్ సానుకూలంగా స్పందించారు. వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే పెండింగ్ ప్రాజెక్టుల‌ను యుద్ధ‌ప్రాతిపాదిక‌న పూర్తి చేస్తామ‌ని, రైతుల‌కు ఉచితంగా బోర్లు వేయిస్తామ‌ని, పెట్టుబ‌డి కింద ఏడాదికి రూ.12500 చెల్లిస్తామ‌ని హామీ ఇచ్చారు. రాజ‌న్న బిడ్డ హామీతో రైతులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. 
Back to Top