సీఆర్డీఏ కార్యాలయం ఎదుట రైతుల ఆందోళన

విజయవాడ: రాజధాని రైతుల నోట్లో మట్టికొడుతూ టీడీపీ సర్కార్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. భూములివ్వని రైతులపై కక్షసాధింపుకు పాల్పడుతోంది.   ఉండవల్లి, పెనుమాక రైతుల పొలాల్లో  రోడ్డు మార్కింగ్ పిల్లర్లు వేయడం పట్ల అన్నదాతలు కన్నెర్ర చేశారు. 

 విజయవాడలో సీఆర్డీఏ కార్యాలయం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. సీఆర్డీఏ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భూముల జోలికి రావొద్దని కోర్టు చెప్పినా.. అధికారులు భూమలివ్వాలంటూ తమను బెదిరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Back to Top