సాగునీటి కోసం రోడ్డెక్కిన అన్నదాతలు


 కృష్ణా జిల్లా: సాగునీటి కోసం అన్నదాతలు రోడ్డెక్కారు. కృష్ణా డెల్టా చివరి భూములకు సాగునీరు ఇవ్వాలని కోరుతూ కృష్ణా జిల్లా అవనిగడ్డలో రైతులు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్‌ఆర్‌సీపీ నాయకులు మాట్లాడుతూ..చంద్రబాబు తీరుతో రైతుల బతుకులు ఛిద్రమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని, నిరుద్యోగులకు భృతి ఇస్తామని మాట తప్పారన్నారు. రైతులకు ఏ ఒక్క పంటకు గిట్టు బాటు ధర లేక నష్టపోయామని, ఖరీఫ్‌లో పంటలు సాగు చేసుకుందామనుకుంటే నీరు ఇవ్వడం లేదని మండిపడ్డారు. చివరి ఆయకట్టుకు నీరు ఇవ్వకపోతే వరి నారుమళ్లు ఎండిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. నీరు ఇవ్వకపోతే విజయవాడ బ్యారేజీపై కూర్చుంటామని, ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.


 

  
 
Back to Top