చెర‌కు రైతుల‌కు చేదు ఫ‌లాలున‌ష్టాల్లో షుగ‌ర్ ఫ్యాక్ట‌రీలు
మ‌హానేత వైయ‌స్‌ హ‌యాంలో లాభాల బాట‌..
 చంద్ర‌బాబు పాల‌న‌లో న‌ష్టాల మూట‌
విశాఖ‌:  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పాల‌న‌ను విశాఖ జిల్లా రైతులు గుర్తు చేసుకుంటున్నారు. నాడు మ‌హానేత వ్య‌సాయాన్ని పండుగ‌లా చేస్తే..చంద్ర‌బాబు నాలుగేళ్ల పాల‌న‌లో ఏ ఒక్క పంట‌కు గిట్టు బాటు ధ‌ర రాలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. న‌ష్టాల్లో ఉన్న షుగ‌ర్ ఫ్యాక్ట‌రీల‌ను మ‌హానేత  వైయ‌స్ఆర్  ఆదుకుంటే.. చంద్ర‌బాబు వాటిని మూత‌ప‌డే స్థితికి తీసుకొచ్చార‌ని రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. చెర‌కు రైతుల దుస్థితిపై కోట‌వుర‌ట్ల బ‌హిరంగ స‌భ‌లో వైయ‌స్ జ‌గ‌న్ చంద్ర‌బాబును నిల‌దీయ‌డంపై రైతులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.  చంద్ర‌బాబు ఎప్ప‌డు  ముఖ్య‌మంత్రిగా అధికారంలోకి వ‌చ్చిన  స‌హ‌కారం రంగంలో  ఉన్న  షుగ‌ర్ ఫ్యాక్ట‌రీలన్ని న‌ష్టాల్లో కూరుకుపోతాయ‌ని,  మ‌హానేత వైయ‌స్ఆర్ హ‌యాంలోనే త‌మ‌కు న్యాయం జ‌రిగింద‌ని   రైతులు ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర‌లో  వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రించ‌గా..  కోట‌వుర‌ట్ల బ‌హిరంగ స‌భ‌లో  రైతుల‌పై చంద్ర‌బాబు ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్య‌ధోర‌ణిని ప్ర‌శ్నించారు. చెరుకు గిట్టుబాట ధ‌ర‌పై ప్ర‌స్తావించారు. రైతులను నిలువునా మోసం చేస్తూ దోపిడీకి తెగ‌బ‌డుతున్న టీడీపీ ప్ర‌భుత్వంపై నిప్పులు కురిపించారు.  వైఎస్ఆర్ హ‌యాంలో స‌హ‌కార రంగంలో ఉన్న షుగ‌ర్  ఫ్యాక్ట‌రీల‌న్నీ  లాభాల‌బాట‌లో న‌డ‌వ‌గా,  చంద్ర‌బాబు సిఎం అయిన త‌ర్వాత విశాఖ జిల్లాలో త‌మ్మ‌పాల ఫ్యాక్ట‌రీ, విజ‌య‌న‌గ‌రం జిల్లాలో బీంసింగి, శ్రీకాకుళం జిల్లాలో ఆముదాల‌వ‌ల‌స ఫ్యాక్ట‌రీలు చంద్ర‌బాబు హ‌యాంలోనే మూత‌ప‌డ్డాయి.  తాండ‌వ ఫ్యాక్ట‌రీ   ఇప్ప‌టికే న‌ల‌భై కోట్ల రూపాయ‌ల న‌ష్టంలో న‌డుస్తోంది.  ఈ నియోజ‌క‌వ‌ర్గానికి ఎంతో ఉప‌యోగ‌ప‌డే ఏటికొప్పాక ఫ్యాక్ట‌రీ ఇప్ప‌టికే 20 కోట్ల రూపాయ‌ల న‌ష్టంతో కూరుకుపోయింది.  చోడ‌వ‌రం షుగ‌ర్‌ ఫ్యాక్ట‌రీ 100 కోట్ల రూపాయ‌ల న‌ష్టంతో న‌డుస్తోంది. ఈ ప్రాజెక్టుల‌న్నీటిని ఒక ప‌థ‌కం ప్ర‌కారం నిర్వీర్యం చేస్తార‌ని, అనంత‌రం  త‌మ బినామీల‌కు త‌క్కువ‌రేట్ల‌కు తెగ‌న‌మ్ముతారంటూ  క‌డిగిపారేశారు.  ఇదే నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న ఏటికొప్ప‌క ఫ్యాక్ట‌రీ 5 వేల మంది రైతుల‌కు  4 కోట్ల 25 ల‌క్ష‌ల రూపాయ‌ల బ‌కాయిలు ఉన్నాయ‌ని, ఆరునెల‌ల నుంచి ఉద్యోగుల‌కు జీతాలు కూడా రావ‌డంలేద‌న్నారు. ఆ రోజుల్లో దివంగ‌తం వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి హ‌యాంలో ఇదే ఫ్యాక్ట‌రీ 5 కోట్ల రూపాయ‌ల లాభాల బాట‌లో ఉంద‌న్నారు.  ఆ మ‌హానేత చ‌క్కెర ఫ్యాక్ట‌రీల‌న్నీ లాభాల బాట‌లో న‌డ‌వాల‌నే ఉద్దేశ్యంతో  స‌హ‌కార రంగంలో రైతులు బాగుప‌డాల‌నే త‌లంపుతో ట‌న్నుకు రూ.300 నుంచి 400 వ‌రుకూ  రాయితీ ఇచ్చార‌ని, తాండ‌వ ఫ్యాక్ట‌రీకి అయితే ట‌న్నుకు  750 రూపాయ‌లు రాయితీ ఇచ్చిన చ‌రిత్ర  దివంగ‌త నేత రాజ‌శేఖ‌ర్‌రెడ్డిదే అన్నారు.   రాయితీలిచ్చే రోజులు పోయాయ‌ని ఫ్యాక్ట‌రీలు  చెరుకు కొనే రేటు 2,400 రూపాయ‌లు కూడా ఇవ్వ‌లేని ప‌రిస్థితి.  చెర‌కు న‌ర‌క‌డానికి కూలి,ర‌వాణాకు కూలి ఈ రెండు క‌లిపితే మొత్తం 11 వంద‌ల రూపాయ‌లు అవుతుంద‌ని, గిట్టుబాటు ఎక్క‌డ‌న్నా అంటూ వాపోయార‌న్నారు.  వైయ‌స్ జ‌గ‌న్ చెరుకు రైతుల స‌మ‌స్య‌లను ప్ర‌స్తావించి రైతుల్లో కొండంత భ‌రోసాను నింపారు.  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే త‌మ జీవితాలు బాగుపడ‌తాయనే ఆశ‌తో  రాజ‌న్న‌బిడ్డ రాజ్యం కోసం వెయ్యి క‌ళ్ల‌తో  ఎదురుచూస్తున్నారు.. 
Back to Top