అన్నా..హంద్రీనీవా పూర్తి చేయండిచిత్తూరు: హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేయాల‌ని చిత్తూరు జిల్లా రైతులు వైయ‌స్ జ‌గ‌న్‌ను కోరారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు వెల్లువలా ప్రజల మద్దతు లభిస్తుంది. చిత్తూరు జిల్లాకు అడుగుపెట్టిన జననేతకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కొటాల క్రాస్‌ వద్ద రైతులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా హంద్రీనీవా పనులు పూర్తి చేసి నీరు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దివంగత మహానే వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రాజెక్టు 85 శాతం పూర్తయిందని, మిగిలిన పనులు పూర్తి చేయడానికి చంద్రబాబు తాత్సారం చేస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే హంద్రీనీవాను పూర్తి చేసి చిత్తూరుకు నీరు ఇవ్వాలని కోరారు. అదే విధంగా తంబళ్లపల్లిలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని కోరారు. 

 వైయ‌స్ జ‌గ‌న్  భ‌రోసా..
  ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలం ఎద్దులవారి కోట గ్రామంలో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని మ‌హిళ‌లు క‌లిశారు. ఈ సంద‌ర్భంగా డ్వాక్రా రుణాలు మాఫీ కాలేద‌ని, బ్యాంకుల్లో కొత్త‌గా రుణాలు ఇవ్వ‌డం లేద‌ని ఫిర్యాదు చేశారు. మ‌న ప్ర‌భుత్వం వ‌చ్చాక రుణాలు మాఫీ చేస్తాన‌ని ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ వారికి భ‌రోసా క‌ల్పించారు.  


 
Back to Top