బాబు పాలనలో వ్యవసాయం దండగ

– తూర్పు గోదావరి జిల్లా రైతులు
తూర్పు గోదావరి:  చంద్రబాబు పాలనలో వ్యవసాయం దండగగా మారిందని తూర్పు గోదావరి జిల్లా రైతులు వైయస్‌ జగన్‌ ఎదుట  వాపోయారు. ప్రజా సంకల్ప యాత్ర 224వ రోజు వైయస్‌ జగన్‌ పిఠాపురం నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు జననేతను కలిసి తమ కష్టాలు చెప్పుకున్నారు. ఓ రైతు వ్యవసాయం కలిసి రాక మొక్కజొన్న అమ్ముతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో వ్యవసాయం ఓ పండగలా ఉండేదన్నారు. చంద్రబాబు సర్కార్‌ విధానాలతో నష్టపోతున్నామని పామాయిల్‌ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో చెల్లిస్తున్న రేటును ఇక్కడ ఇవ్వాలని రైతులు కోరారు. జిల్లాలో కొత్త ఆయిల్‌ కంపెనీ నిర్మించాలని స్థానికులు జననేత వైయస్‌ జగన్‌కు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబును మరోసారి నమ్మే పరిస్థితి లేదని రైతులు పేర్కొన్నారు. 
 
Back to Top