వైయస్‌ జగన్‌ను కలిసిన మిర్చి, శనగ రైతులు

ప్రకాశం: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో ఇంకొల్లు మండలం మిర్చి, శనగ రైతులు కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. పండిన పంటకు కనీస మద్దతు ధర లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శనగ పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయిందని, ఎకరానికి 8 క్వింటాల్‌కు మించడం లేదని చెప్పారు. గతేడాది రూ.7 వేల మద్దతు ధర ఉండేది. ఇప్పుడు రూ.3500 అంటున్నారు. కనీసం కౌలు డబ్బులు కూడా రావడం లేదు. పండిన పంటకు గిట్టుబాట ధర లేదు. మిర్చికి రూ.10 వేలు ఇ వ్వాలని, శనగకు రూ.6 నుంచి 8 వేలు కవాలని, వైయస్‌ జగన్‌ను కలిసిన మిర్చి, శనగ రైతులు. నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సాగర్‌ నీరు తీసుకురావాలని వైయస్‌ జగన్‌కు కోరారు. వారందరికీ వైయస్‌ జగన్‌ మంచి రోజులు వస్తాయని ధైర్యం చెప్పారు.
 
Back to Top