రుణ‌మాఫీతో అప్పుల ఊబిలో కూరుకుపోయాం


చిత్తూరు: చ‌ంద్ర‌బాబు మాట‌లు న‌మ్మి బ్యాంకు రుణాలు చెల్లించ‌నందుకు అప్పుల ఊబిలో కూరుకుపోయామ‌ని అన్న‌దాత‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా చిత్తూరు జిల్లా గంగాధ‌ర నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గంలోని చిప్ప‌ర‌ప‌ల్లి వ‌ద్ద అన్న‌దాత‌లు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ గోడు వెల్ల‌బోసుకున్నారు. చంద్ర‌బాబు రుణాలు మాఫీ చేస్తార‌ని న‌మ్మిందుకు న‌ట్టేట ముంచార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఒక్క రూపాయి కూడా రుణం మాఫీ కాలేద‌ని, బ్యాంక‌ర్లు కొత్త‌గా రుణాలు ఇవ్వ‌డం లేద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. వ‌ర్షాభావ ప‌రిస్థితుల కార‌ణంగా పంట‌లు పండ‌క న‌ష్టాలు మూట‌క‌ట్టుకుంటున్నాన‌మి వాపోయారు. వారి స‌మ‌స్య‌లు విన్న వైయ‌స్ జ‌గ‌న్ చ‌లించిపోయారు. మ‌నంద‌రి ప్ర‌భుత్వం రాగానే ప్ర‌తి రైతుకు పెట్టుబ‌డి కోసం ప్ర‌తి ఏటా రూ.12,500 మే నెల‌లోనే ఇస్తాన‌ని, పంట సాగుచేసే ముందే గిట్టుబాటు ధ‌ర ప్ర‌క‌టిస్తామ‌ని, ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ నిధి ఏర్పాటు చేస్తామ‌ని, ప్ర‌కృతి వైఫ‌రీత్యాల నిధితో ఆదుకుంటామ‌న్నారు. ప్ర‌తి మండ‌ల కేంద్రంలో కోల్డు స్టోరేజీ ఏర్పాటు చేసి అన్న‌దాత‌కు తోడుగా ఉంటాన‌ని వైయ‌స్ జ‌గ‌న్ హామీ ఇవ్వ‌డంతో రైతులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.
Back to Top