మ్యాజిక్‌ షో మాదిరి చంద్రబాబు మాటలురాప్తాడు: చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి వరుస కరువులతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతు సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రాప్తాడు నియోజకవర్గంలో చిన్నంపల్లి క్రాస్‌రోడ్డు వద్దకు చేరిన ప్రజా సంకల్పయాత్రను రైతు సంఘాల నాయకులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ను కలిసి సమస్యను చెప్పుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పుణ్యంతో హంద్రీనీవా ప్రాజెక్టు 90 పూర్తయ్యిందన్నారు. మిగిలిన 10 శాతం పనులను ఇప్పటి వరకు చంద్రబాబు పూర్తి చేయలేకపోయాడన్నారు. నదుల అనుసంధానం, గంగ పూజలు అంటూ చంద్రబాబు అందరినీ మోసం చేస్తున్నాడన్నారు. పోలవరం, పట్టిసీమ, పురుషోత్తపట్నం అంటూ మ్యాజిక్‌ షో మాదిరిగా చూపిస్తున్నారన్నారు. గతంలో వైయస్‌ఆర్‌ హయాంలో 42 కేజీ శనిగ బస్తా రూ. 3 వేలుపైగా విక్రయించే వారమని, ప్రస్తుత చంద్రబాబు పాలనలో రూ. 16 వందలు వస్తుందన్నారు. గిట్టుబాటు ధర కల్పించకపోతే రైతులు ఎలా బతకాలని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇలాగే కొనసాగితే రైతు అనే వ్యక్తి కంటికి కూడా కనిపించడని ఆందోళన వ్యక్తం చేశారు. 
Back to Top