గుడ్డి సర్కార్ కు తెలియజెప్పేందుకే ధర్నా

పెనుకొండ: జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితిపై ప్రభుత్వం కళ్లు తెరిపించడానికి  రైతాంగం తరపున జిల్లా కేంద్రంలో  ఈనెల 27న భారీ ఎత్తున ధర్నా చేపట్టనున్నట్లు వైయస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ పేర్కొన్నారు. పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల  మండలం కొండాపురం గ్రామంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రస్తుతం జిల్లా కరువు బారిన పడిందని, మునుపెన్నడూ లేని విధంగా  కరువు కరాళ నత్యం చేస్తోందన్నారు.

వర్షాభావం ఏర్పడిన సందర్భంలో జిల్లా మంత్రులు కాని ఎమ్మెల్యేలు, ఎంపీలు కాని కరువును పూర్తీగా పట్టించుకోకుండా గాలికొదిలేసారన్నారు. వాస్తవ పరిస్థితులను గుడ్డి ప్రభుత్వానికి తెలియజేయడానికి 27న పెద్ద ఎత్తున జిల్లా కేంద్రంలో ధర్నా చేపడతామన్నారు. ఈ ధర్నాకు అధ్యక్షుడు  వైయస్‌ జగన్‌ హాజరై  ధర్నాలో  ప్రసంగిస్తారని ఆయన తెలిపారు. జిల్లా రైతులు, ప్రజలు, పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ధర్నాకు తరలిరావాలని శంకరనారాయణ కోరారు.  నాయకులు కన్వీనర్‌ ఫక్రోద్దిన్,  సుదర్శనశర్మ, గంపల వెంకటరమణారెడ్డి, ధనుంజయరెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు.
Back to Top