పంట బోదెను వదలని పచ్చ చొక్కాలు

గుడివాడ: పాదయాత్ర చేస్తున్న
 ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోనహ్ రెడ్డి ను
ఒంటిమిల్లి మండలం సత్యనారాయణ పురానికి చెందిన మహిళా రైతు ధర్మవరపు లక్ష్మి ఆమె
కుమారుడు కొంకెపూడి క్రాస్ దగ్గర కలుసుకుని తెలుగుదేశం నాయకులు అకృత్యాలకు అడ్డూ
అదుపు లేకుండా పోతోందని ఫిర్యాదు చేశారు. పార్టీ నాయకులు తమ పంట బోదెను ఆక్రమించుకున్నారని
వారు జననేత దృష్టికి తీసుకుని వచ్చారు. పంట కాలువను కబ్జా చేశారని, దీంతో పంటకు నీళ్లు
రావడం లేదని వీటిపై పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించడం లేదని
వారు వాపోయారు. సమస్యకు పరిష్కారం చూపి తమ జీవనాధారాన్ని కాపాడాలని కోరుతూ
విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. 

Back to Top