విశ్వేశ్వరరెడ్డి సహా రైతుల అరెస్ట్

అనంతపురం : కరువు ప్రాంతాలను సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. విశ్వేశ్వరరెడ్డి  నేతృత్వంలో రైతులు రాగులపాడు పంపుహౌస్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. ఎమ్మెల్యేతో పాటు రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ...హంద్రీనీవా మొదటి దశ వైయస్ఆర్ హయాంలోనే పూర్తయినా..ఇప్పటి వరకు పంటపొలాలకు నీరు విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే హంద్రీనీవాకు నీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని విశ్వేశ్వరరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Back to Top