రాజ‌ధాని ప్రాంత‌ రైతుల ఆందోళన

 ఏపీ రాజధాని ప్రాంత గ్రామాల రైతులు ఆందోళ‌న‌కు దిగారు. గుంటూరు జిల్లా  తాడేపల్లి మండలం పెనుమాకలో సీఆర్డీఏ కార్యాలయం వద్ద   నిరసన చేప‌ట్టారు. గతంలో తాము ఇచ్చిన భూముల అంగీకార పత్రాలు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. ఇప్ప‌టి దాకా వేల సంఖ్య‌లో అంగీకార ప‌త్రాలు తీసుకొన్నామ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. కానీ అత్య‌ధిక శాతం రైతులు బ‌ల‌వంతంగానే ఈ భూముల్ని అప్ప‌గించార‌న్న మాట వాస్త‌వం. ఈ ప‌రిస్థితుల్లో రైతులు ఆందోళ‌నకు దిగ‌టం దీన్ని బ‌ల‌ప‌రుస్తోంది.  ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి నిర్ణయం తీసుకుంటామని స్థానిక అధికారులు చెబుతున్నారు.
Back to Top