టీడీపీకి ఓటేసిన పాపానికి..!

గుంటూరు(మల్కాపురం): టీడీపీకి ఓటేసిన పాపానికి ప్రజలంతా చింతిస్తున్నారు. భూమి ఇవ్వలేదన్న కక్షసాధింపుతో పచ్చనేతలు తన చెరకు పంటను తగలబెట్టారని బాధిత రైతు గద్దె చిన చంద్రశేఖర్ ..ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ముందు వాపోయాడు. తుళ్లూరు మండలం మల్కాపురంలో దుండగులు చిన చంద్రశేఖర్ చెరకు పంటను దగ్ధం చేశారు. వారికి అండగా నిలిచిన వైఎస్ జగన్ ...కాలిన పంటను సందర్శించి వారి కుటుంబాల్లో ధైర్యం నింపారు.

ల్యాండ్ పూలింగ్ కు భూమి ఇవ్వనందునే తన పంటను తగులబెట్టారని బాధితుడు వైఎస్ జగన్ ముందు తనగోడు వెళ్లబోసుకున్నాడు. గత ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసినందుకే.... తమకు ఈదుర్గతి పట్టిందని ఆవేదన వ్యక్తం చేశాడు.  భూములు ఇవ్వకపోవడం తాము చేసిన నేరమా అని ప్రశ్నించారు. భూములు ఇవ్వబోమని చెబుతున్నా బలవంతంగా లాక్కుంటున్నారని ఈసందర్భంగా పలువురు రైతులు వైఎస్ జగన్ కు మొరపెట్టుకున్నారు. బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ అన్నదాతల తరపున పోరాడుతానని వైఎస్ జగన్ వారికి భరోసా కల్పించారు. 
Back to Top