బాబు నిర్లక్ష్యం వల్లే రైతు ఆత్మహత్యలు

వైయస్ఆర్ జిల్లాః గండికోట ప్రాజెక్ట్ ను చంద్రబాబు నిర్లక్ష్యం చేశారని వైయస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మండిపడ్డారు. ఆ ప్రాజెక్ట్ పూర్తి అయ్యి ఉంటే హర్షవర్ధన్ రెడ్డి ఆత్మహత్య జరిగుండేది కాదని అభిప్రాయపడ్డారు. హర్షవర్ధన్ రెడ్డి కుటుంబసభ్యులను వైయస్ జగన్ పరామర్శించారు. రైతులకు 2014 నుంచి  ప్రభుత్వం ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదని, ఇన్సూరెన్స్ బకాయిలు కూడ అలానే ఉన్నాయని అన్నారు. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంటే ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వొద్దని బాబు ఆదేశిస్తున్నారని మండిపడ్డారు. త్వరలోనే మన ప్రభుత్వం వస్తుంది...రైతుల కష్టాలన్నీ తీరుతాయని వైయస్ జగన్ వారికి భరోసా కల్పించారు. 
Back to Top