చంద్రబాబు చేసిన పాపం.. ఒక రైతు బలవన్మరణం

అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన మోసానికి ఒక యువ రైతు బలవంతంగా ప్రాణాలు తీసుకొన్నాడు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజక వర్గం రాయంపల్లి గ్రామానికి చెందిన రైతు కోదండ రామ్ రెడ్డి తనువు చాలించాడు. ఈ ఘోరానికి చంద్రబాబు చేసిన మాఫీ మోసమే కారణమని అతని సన్నిహితులు వాపోతున్నారు.

ఎంబీఏ చదివిన కోదండరామిరెడ్డి తండ్రి చనిపోవడంతో స్వగ్రామానికి వచ్చి వ్యవసాయం మొదలు పెట్టాడు. సోదరి వివాహం కోసం, ఇతర ఖర్చుల కోసం అప్పులు చేయాల్సి వచ్చింది. దీంతో బ్యాంకులో పొలం పత్రాలు తాకట్టు పెట్టి డబ్బు తీసుకొన్నారు. వ్యవసాయ రుణాలు మాఫీ అవుతాయన్న చంద్రబాబు మాటల్ని గుడ్డిగా నమ్మారు. చివరకు మాఫీ లేకపోవటంతో అప్పుల ఊబిలో మునిగిపోయారు. మొత్తం వ్యవసాయ రుణాలన్నీ మాఫీ అవుతాయంటే అంతా నమ్మారు. చివరకు రూ. 64వేల అప్పునకు గాను కేవలం రూ.7వేలు మాత్రమే మాఫీ అయింది.  మిగిలిన అప్పుకి వడ్డీల మీద వడ్డీలు అయిపోయాయి. ఈలోగా చెల్లి పెళ్లి కోసం చేసిన అప్పు కూడా తోడైంది. దీంతో పూర్తిగా అప్పుల పాలయ్యాడు. ముందు కొంత మొత్తం కట్టించుకొన్న బ్యాంకు అధికారులు, పూర్తి అప్పు తీరిస్తే కానీ పాస్ బుక్ ఇచ్చేది లేదని తేల్చారు. దీంతో మనో వేదనకు గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

బలవన్మరణంలో కొత్త కోణం
కోదండరామిరెడ్డి మరణంలో కొత్త కోణం బయట పడింది. బ్యాంకు అధికారుల్ని పదే పదే ప్రాథేయ పడినా కోదండరామ్ ను కనికరించలేదని తెలుస్తోంది.  ఈ సమయంలో పోలీసుల్ని పిలిపించినట్లు తెలుస్తోంది. పోలీసులు బ్యాంకు ఆవరణలోనే అతడ్ని బాగా కొట్టారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అందరి సమక్షంలో పోలీసులు కొట్టడంతో మనో వేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర శోకం నెలకొంది.

అండగా నిలిచిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే
సంగతి తెలిసిన వెంటనే స్థానిక వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి అక్కడకు చేరుకొన్నారు. మృతదేహంతో కలిసి రాస్తారోకో కు దిగారు. సంఘటనపై పూర్తి గా విచారణ జరిపించి రూ. 15లక్షల పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. అనేక చోట్ల ప్రభుత్వ మోసానికి ప్రజలు అల్లాడిపోతున్నారని ఉదహరించారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం
ఇంత జరుగుతున్నా ప్రభుత్వ అధికారులు కానీ, ఇతర ప్రజా ప్రతినిదులు కానీ అక్కడకు రాలేదు. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నా, ఇతర సీనియర్ నేతలు ఉన్నా అటుకేసి తొంగి చూడలేదు. ్రపభుత్వం చేసిన నయవంచనకు పూర్తిగా మోసపోయిన యువ రైతు ఉదంతం ఇది.  ఏమాత్రం   ప్రభుత్వ పక్షం నుంచి స్పందన లేకుండా పోయింది. రైతుల పట్ల ప్రభుత్వానికి ఉండే నిర్లక్ష్యం మరోసారి బయట పడింది. .

ఉరవకొండ బంద్

తెలుగుదేశం ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు అక్కడ వారిని కలచివేసాయి. ఒక రైతు క ళ్ల ముందు ఆత్మహ త్యకు  పాల్పడటం ఆవేదనకు గురి చేసింది. దీంతో ఉరవ కొండలో బంద్ పాటించారు. వైఎస్సార్ సీపీ, వామపక్షాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో బంద్జరిగింది. పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొన్నారు.
Back to Top