పార్టీ ఫిరాయించినట్లు తప్పుడు ప్రచారం

కృష్ణా జిల్లా: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఫ్యాన్‌ గుర్తుపై గెలిచిన మాదిపాడు ఎంపీటీసీ సభ్యుడు తుమాటి సత్తయ్య పార్టీ మారినట్లు టీడీపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఈ మేరకు శుక్రవారం సత్తయ్య విలేకరులతో మాట్లాడుతూ..టీడీపీ నేతలు తనను బెదిరించి, మా కుటుంబ సభ్యులకు వారి పార్టీ కండువ కప్పి పార్టీ మారినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని పేర్కొన్నారు. తాను దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి వీరాభిమానినని, వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలన్నదే తన ధ్యేయమన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారనని సత్తయ్య స్పష్టం చేశారు.

Back to Top