టీడీపీ, బీజేపీల దొంగ సన్మానాలు

బాబు ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నారు
- వైయ‌స్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఉమారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు
గుంటూరుః చంద్రబాబు ప్ర‌త్యేక హోదాను నీరుగార్చుతూ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నార‌ని  వైయ‌స్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఉమారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు ఫైర్ అయ్యారు. గుంటూరులో చైతన్యపథం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రత్యేకహోదా అంశంపై శాసనసభ, మండలిలో వైయస్సార్సీపీ చర్చకు పట్టుబట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బాబు హోదాను నిర్వీర్యం చేస్తున్నాడని మండలిలో ఈఅంశాన్ని లేవనెత్తితే టీడీపీ నేతలు అడ్డుతగిలారని అన్నారు. ముఖ్యమంత్రి సమక్షంలోనే టీడీపీ సభ్యులు త‌న‌పై మాటల యుద్దానికి దిగార‌న్నారు.  ప్ర‌తిప‌క్ష నాయ‌కుడి గొంతు నొక్కుతుంటే చంద్ర‌బాబు స్పందించ‌క‌పోవ‌డం అత్యంత హేయ‌మైన చ‌ర్యగా అభివర్ణించారు.  హోదాపై చర్చకు అనుమతించని కారణంగానే నిర‌స‌న‌గా తాము వాకౌట్ చేశామని చెప్పారు. ప్ర‌తిప‌క్ష పార్టీ నాయ‌కుల అభిప్రాయాల‌ను క‌నీసం తెలుసుకునే ప్ర‌య‌త్నం కూడా సీఎం చేయ‌క‌పోవ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ మొద‌టి నుంచి ప్ర‌త్యేక హోదా కోసం పోరాడుతుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 

ప్ర‌త్యేక ప్యాకేజీలో అంత‌ర్యం ఏమిటి?
- వైయ‌స్సార్‌సీపీ జిల్లా అధ్య‌క్షుడు మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌
ఎన్నిక‌ల‌కు ముందు వెంక‌య్య నాయుడు ప‌దేళ్లు ప్ర‌త్యేక హోదా కావాలంటే లేదులేదు... పదిహేనేళ్లు ప్ర‌త్యేక హోదా కావాల‌న్న చంద్ర‌బాబు ఇప్పుడు ప్ర‌త్యేక ప్యాకేజీని స్వాగ‌తించ‌డంలో అంత‌ర్య‌మేమిట‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్య‌క్షుడు మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ ప్రశ్నించారు. చైత‌న్య‌ప‌ధం కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ... చ‌ంద్ర‌బాబు ఎన్నిక‌ల స‌మ‌యంలో పూర్తిస్థాయిలో రుణ‌మాఫీ, ఉద్యోగాలు, నిరుద్యోగ‌భృతి ఇస్తాన‌ని చెప్పి ప్ర‌జ‌ల‌ను దారుణంగా మోసం చేశార‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. రుణమాఫీ ఏ విధంగా చేస్తావ‌ని ఎల‌క్ష‌న్ క‌మిటీ చంద్ర‌బాబును అడిగితే... తొమ్మిదేళ్లు ముఖ్య‌మంత్రిగా చేశాను, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితులు నాకు తెలుస‌ని చెప్పారని, మరి ఇప్పుడు ఎందుకు మొహం చాటేశారని నిలదీశారు. ఎన్నిక‌ల‌కు ముందు చేసిన మోసాల‌నే ప్ర‌స్తుతం చేస్తున్నార‌న్నారు.  మంత్రులు నారాయ‌ణ‌, పుల్లారావులు గుర్రాలపై ఎక్కి తిరిగి దొంగ స‌న్మానాలు చేయించుకున్నార‌ని, ఇప్పుడు వెంక‌య్య‌నాయుడు సైతం అదేవిధంగా దొంగ స‌న్మానాలు చేయించుకున్నార‌ని విమ‌ర్శించారు. 
Back to Top