కుట్రపూరిత కేసులను ఉపసంహరించుకోవాలి

దాచేపల్లి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత, ప్రధానప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రభుత్వం పెట్టిన కుట్రపూరితమైన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని పార్టీ గుంటూరు జిల్లా దాచేపల్లి మండల కన్వీనర్‌ షేక్‌ జాకీర్‌హుస్సేన్, జెడ్పీటీసీ సభ్యుడు మూలగొండ్ల ప్రకాష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. వైయస్‌ జగన్‌పై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలు నారాయణపురం ఆర్‌అండ్‌బీ బంగ్లా నుంచి బస్టాండ్‌ సెంటర్‌ మీదుగా స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా జాకీర్‌హుస్సేన్, జెడ్పీటీసీ సభ్యుడు ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ బస్సు ప్రమాదంలో మృతిచెందిన మృతులకు ప్రభుత్వం అండగా ఉండలేదని, అండగా ఉండి పరామర్శించటానికి వచ్చిన ప్రతిపక్షనేతను అడ్డుకుకోవటం దుర్మార్గమన్నారు. సీఎం చంద్రబాబు విజయవాడలో ఉండికూడా బాధితులను పరామర్శించలేని స్థితిలో ఉన్నాడని, బాధ్యత కలిగిన ప్రతిపక్షనేతగా వైయస్‌ జగన్‌ వస్తే అడ్డుకుని తప్పుడు కేసులు పెట్టాటం ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలకు నిదర్శమన్నారు. వైయస్‌ జగన్‌పై పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోకపోతే ఆందోళనను ఉదృతం చేస్తామని,  కార్యక్రమంలో ఎస్సీసెల్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పేరుపొగు రాజశేఖర్, జిల్లా ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడు మందపాటి రమేష్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మునగా పున్నారావు, మాజీ ఎంపీపీలు అంబటి శేషగిరిరావు, కోప్పుల సాంబయ్య, సర్పంచ్‌ బు్రరి విజయ్‌కుమార్‌రెడ్డి, ఎంపీటీసీలు జంగా సైదులు, గుడూరి గోవర్ధన్‌రావు, ప్రగాఢ నాగమ్మ, భాగం వెంకటేశ్వర్లు, యువజన విభాగం, బిసీసెల్‌ మండల కన్వీనర్లు కాసర్ల నరసింహరెడ్డి, బత్తుల బాలయ్య, మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఆకూరి వీరారెడ్డి,  నాయకులు కొప్పుల అప్పారావు, కటకం బ్రహ్మానాయుడు, షేక్‌ ఖాదర్‌బాషా, షేక్‌ పెదలాలా, చెట్టిపొగు సంజయ్, బండ్ల ఏసుపాదం, కొ్రరపాటి ఏ్రరయ్య, రామిరెడ్డి, బుచ్చిరెడ్డి, వేముల తిరుపతయ్య, వేముల శ్రీహరి, కొమ్ము బుజ్జి, పానాది వెంకటనారాయణ, అన్నం సైదల్లి, ధర్మవరపు మస్తాన్‌వలి, చింతాల దానియేలు, నాళం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Back to Top