వైయస్‌ఆర్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు

నెల్లూరు(చిట్టమూరు): స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన ఇద్దరు ఎంపీటీసీలు  శాసన మండలి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించగా, వారు కిడ్నాప్‌ అయ్యారని టీడీపీ నేతలు హైడ్రామా సృష్టించారు. చిట్టమూరు మండలంలోని మల్లాం–1, మల్లాం–2 ఎంపీటీసీలు తిరుమూరు అశోక్, చెంగయ్య బుధవారం వైయస్‌ఆర్‌ సీపీకు మద్దతు తెలిపేందుకు నెల్లూరుకు వెళ్లగా వారిని కిడ్నాప్‌ చేశారంటూ వదంతులు సృష్టించారు. దీంతో చిట్టమూరు, నెల్లూరు రూరల్‌ పోలీసులు ఒక శిబిరంలో ఉన్న ఎంపీటీసీలను తీసుకుని చిట్టమూరు పోలీస్‌ స్టేషన్‌కు గురువారం తెల్లవారు జామున తరలించారు. అయితే నెల్లూరు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆ ఇద్దరు ఎంపీటీసీలు తమను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదని  స్వచ్ఛందంగా తామే వచ్చామని చెప్పారు. నెల్లూరు నుంచి చిట్టమూరుకు తరలించే లోపు హైడ్రామా నడపడంతో ఎంపీటî సీలు పోలీసులకు ఏమి చెప్పారో వైయస్‌ఆర్‌ సీపీ నేతలపై అర్థ రాత్రి దాటిన తర్వత కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే పోలీస్‌ స్టేషన్‌లో స్థానిక వైయస్‌ఆర్‌ ïసీపీ నాయకులపై కిడ్నాప్, అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ఎంటీపీటీలను వారి ఇళ్లకు పంపుతున్నామని పోలీసులు చెప్పినప్పటికీ ఎంపీటీసీలు  ఇద్దరిని టీడీపీ శిబిరానికి తరలించారు.  ఆ ఇద్దరు ఎంపీటీసీలతో మాట్లాడేందుకు బంధువులు ప్రయత్నిస్తున్నా వారు అందుబాటులోకి రావడం లేదు. వైయస్‌ఆర్‌ సీపీకు మద్దకు తెలియజేయాలనుకున్న ఎంపీటీసీలనంతా నయానో, భయానో లొంగదీసుకుని శిబిరాలకు తరలించే ఏర్పాట్లను టీడీపీ నాయకులు ముమ్మరం చేస్తున్నారు. ఆ పార్టీకు చెందిన ఎంపీటీసీలను కూడా శిబిరాలకు తరలిస్తున్నారు.

Back to Top