ప్రభుత్వ పథకాల అమలులో విఫలం

పాణ్యంః గ్రామాల్లో నెలకొన్న సమస్యలు తెలుసుకునేందుకు వైయస్సార్‌సీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గడపగడపకు వైయస్సార్‌సీపీ కార్యక్రమాన్ని అందరూ కలిసి జయ ప్రదం చేయాలని జిల్లా అధ్యక్ష్యులు గౌరు వెంకట్‌రెడ్డి, నియోజకవర్గ ఎమ్యెల్యే గౌరు చరితారెడ్డిలు అన్నారు. గురువారం మండల కేంద్రమైన పాణ్యంలోని పార్టీ కార్యాలయంలో గ్రామాల నాయకులతో కార్యకర్తల సమావేశాన్ని మండల కన్వీనర్‌ పాలం చంద్రశేఖర్‌రెడ్డి ఆద్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రజలకు ప్రభుత్వ పథకాలు చేరవేయ్యడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. గత ప్రభుత్వంలో అందించే పథకాలకు పేర్లు మార్చి పథకాలు కొనసాగిచడం సిగ్గుచేటు అన్నారు. గత మూడు ఎళ్ల నుండి ప్రభుత్వం చేసిన ఘనత కేవలం అవినీతి పాలన, అధికారులపై దాడులు, అ«ధికారి పార్టీ నాయకులకు ప్రజాధనాన్ని దొచిపెట్టే ప్రణాళిక అన్నారు. ఏ గ్రామాల్లో చూసిన మౌళిక సదుపాయాలు లేక ప్రజలు నేటికి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అంతేకాక ఇంతటి ఘనత ఉన్న భారత రాజ్యాంగంలో మొట్టమొదటి సారిగా ఒడిపోయిన ఎమ్యెల్యేలకు నిధులు కేటాయించడం అత్యంత సిగ్గుచేటుగా పరిగణించారు. ఇలాంటి కొత్త చట్లాకు తెచ్చి అన్ని విదాలుగా టీడీపీ కే లభ్ది చేకురేలా ప్రభుత్వం అధికారులతో పనులు చేయించడం నితిమాలిన పనులన్నారు. ఇలాంటి విషయాలను ప్రజలకు తెలియసేందుకే ప్రతిపక్ష నేత పార్టీ అధ్యక్ష్యులు జగన్‌మోహన్‌రెడ్డి గడప గడపకు వైఎస్సార్‌సీపీ కార్యక్రమాన్ని చేట్టారని తెలిపారు. తాము పర్యటించిన సమస్యలను తెలుసుకోవడం జరుగుతుందని తెలిపారు. వచ్చే నెల ఒకటవ తేది నుండి మండలంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని అన్నారు. మొదటి రోజున ఎస్‌ కొత్తూరు, గగ్గటూరు, అనుపూరు, అహల్యాపురం గ్రామాల్లో కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ వైఫల్యాలతో ముద్రించిన కరపత్రాలను అందించి ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ఎండగడతామని అన్నారు.

నీరు ఉన్నా వదలడం లేదు
మండల కేంద్రమైన పాణ్యంలోని ఎస్సార్బీసీ కాలనీలో మంచి పుస్కలంగా ఉన్న నీరు వదలడం లేదని కాలనీలో ఉన్న కొందరూ అధికారలు పాణ్యం ఎమ్యెల్యేకు విన్నవించుకున్నారు. వారు మాట్లాడుతూ కాలనీలలో ఇంత వరకు వందకు పైగా ఇళ్లు ఉన్నాయని కాలనీ నిర్వహణ కోరకు తమ జీతాల నుండి కొంత నగదు కట్‌ అవుతుందని అన్నారు. అయితే గత వేసవి నుండి వాటర్‌ బాయ్, మరో అ««ధికారి కలిసి ఉద్దేశ్యపూర్వకంగా కాలనీకి నీరు వదలకుండా మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. దీంతో నీటి కోసం రోజు అనేక ఇబ్బందులు పడి నీటిని తెచ్చుకుంటున్నామని వాపోయారు. అంతేకాక కాలనీకి మూడు తాగునీటి బోర్లు, ఒక ఓహెచ్‌ఆర్‌ ఉన్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని డీఈ విజయ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకుపోయి ఎలాంటి చర్య తీసుకోలేదని ఆవేదన చేందారు. తమకు ఎలాగైన తాగేందకు నీరు అందించాలని ఎమ్యెల్యేకు గోడు విన్నవించుకున్నారు. కాలనీలో ఉన్న గజిటేడ్‌ అధికారని కాపురం లేరని అందుకే ఈ సమస్యలు వస్తున్నట్లు తెలిపారు. దీంతో ఎమ్యెల్యే గౌరు చరతారెడ్డి సంబదింత అధికార లతో ఫోన్‌లో మాట్లాడి నీరువదలకుంటే ఉన్నతాదికారుల దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం నీటిని వదలాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామాల నాయకులు ఎంపీపీ చిన్న సంజీవ, కౌలురు సర్పంచ్‌ విజయభాస్కర్‌రెడ్డి, వెంగళ్‌రెడ్డి, కొరటమద్ది ఎంపీటీసీ సభ్యులు నాగేశ్వరెడి,్డ సుబ్బారెడ్డి, అమరసింహరెడ్డి, శివారెడ్డి, ఇమాం, శ్రీనివాసులు, ఖాదర్, మిలటరి సుబ్బారెడ్డి, బాలరాజు, సుబ్బయ్య, సత్యనారాయణరెడ్డి, ఆలమూరు డెరెక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి, దానం, విజయ్, వెంకటేశ్వర్లు, తిరుపతిరెడ్డి , కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top