వైయస్సార్‌ సీపీ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో కంటిపరీక్షలు

చిలకలూరిపేటటౌన్: వైయస్సార్‌ సీపీ కౌన్సిలర్లు దేవీకుమారి, బొల్లెద్దు కృపమ్మ ఆధ్వర్యంలో పట్టణంలోని తూర్పు దళితవాడలో బుధవారం కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ప్రసాద్‌ కంటి ఆసుపత్రి డాక్టర్లు రోగులకు పరీక్షలు జరిపారు. 87మంది వృద్ధులు పరీక్షలు చేయించుకోగా అందులో 17 మందికి ఆపరేషన్లకు అవసరమని చెప్పారు. వీరందరికీ ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఆపరేషన్లు అవసరం లేని వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్‌ సహకారంతో కంటి వైద్యశిబిరం నిర్వహించినట్లు పార్టీ యువజన విభాగం పట్టణాధ్యక్షుడు సాతులూరి కోటి, సీనియర్‌ నాయకులు బొల్లెద్దు చిన్నా చెప్పారు. త్వరలో మెగా శిబిరం చేపడతామన్నారు. వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Back to Top