అవినీతి ప్రభుత్వాన్ని ఎండగడుతాం

  • 36 అంశాలపై ప్రధానంగా చర్చకు పట్టుబడుతాం
  • ప్రత్యేకహోదా, కరువు,ఓటుకు కోట్లు కేసు
  • పుష్కరాల్లో అవినీతిపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం
  • వైయస్సార్సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి
హైదరాబాద్ః అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక హోదా సహా 36 అంశాలపై చర్చించాలని  వైయస్ఆర్ సీఎల్పీ నిర్ణయించినట్లు  వైయస్సార్సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి తెలిపారు. ప్రత్యేకహోదా చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడలకు పరిమితమైంది కాదని..రాష్ట్ర ప్రజల హక్కు అని అన్నారు. ప్రత్యేకహోదాపై చర్చకు ఓ రోజు పూర్తిగా కేటాయించాలని ప్రతిపక్ష పార్టీగా తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. గంట, రెండు గంటలతో అయిపోయే జీఎస్టీ బిల్లుకు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చూడడం తగదన్నారు. అసెంబ్లీ సమావేశాలను కనీసం 20 రోజులైనా నిర్వహించాలన్నారు. 

ఏపీకి స్పెషల్ స్టేటస్ వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ప్రజల ఆలోచనను ప్రతిబింబించే విధంగా అసెంబ్లీలో వైయస్సార్సీపీ స్టాండ్ ఉంటుందని తెలియజేశారు. పుష్కరాలను ప్రభుత్వ అవినీతిమయం చేసిందని రఘుపతి దుయ్యబట్టారు.  ఉన్నతాధికారులందరినీ నెల పదిహేను రోజుల పాటు పుష్కరాల్లో పెట్టి.....రాష్ట్రంలోని పనలన్నంటినీ పక్కనబెట్టి పెట్టిందని ఆరోపించారు. కోటిమంది వస్తే మూడు కోట్ల మంది వచ్చారని చెప్పుకుంటూ అనవసరమైన ప్రచార ఆర్భాటంగా చేసుకున్న తంతును అసెంబ్లీలోఎండగడుతామన్నారు.  పుష్కరాలకు చేసిన ఖర్చుపై ప్రభుత్వాన్నినిలదీస్తామని రఘుపతి స్పష్టం చేశారు. 

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయినా కూడా...కోర్టులను అడ్డుపెట్టుకొని స్టే తెచ్చుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రజలు న్యాయవ్యవస్థను అనుమానించే పరిస్థితికి బాబు తీసుకెళ్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు పేరు 33సార్లు ఛార్జిషీట్ లో నమోదైన విషయాన్ని గుర్తు చేశారు. దీన్ని  ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు వైయస్సార్సీపీ సిద్ధంగా ఉందన్నారు.  ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో రైతులు కరువుతో అల్లాడుతున్నారని చెప్పారు. పుష్కరాల కోసమని బాబు నీళ్లు తరలించుకుపోయి  ఖరీఫ్ పంటలను ఎండబెట్టారని మండిపడ్డారు. పులిచింతలలో 18 టీఎంసీల నీళ్లున్నా విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు , అధికారులు పంటలకు నీళ్లు ఇచ్చే విషయంలో గానీ, రైతులకు భరోసా ఇవ్వడంలో గానీ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. 
Back to Top