వైయస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం

జామి: నేడు మండల కేంద్రమైన జామిలో వైయస్సార్‌సీపీ విస్తృతస్దాయి సమావేశం జరగనుంది. ఈసమావేశానికి రాష్ట్ర వైయస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి హజరవుతున్నారు.ఈ సమావేశానికి సంభందించి వైయస్సార్‌సీపీ నేతలు ఏర్పాట్లు పూర్తిచేసారు. స్దానిక వెంకటేశ్వర కళ్యాణమండపంలో మద్యాహ్నం 3గంటలకు జరగనుంది. సమావేశానికి ఉత్తరాంద్ర కన్వీనర్‌ కోలగట్ల వీరభద్రస్వామి,జి ల్లాపార్టీ అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్, జిల్లాపార్టీ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు తదితర పెద్దలు హాజరవుతున్నారు. ఈసమాశానికి వైయస్సార్‌సీపీ  నేతలు, కార్యకర్తలు, అభిమానులు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, రైతు సంఘాలు, విద్యా ర్ధిసంఘాలు, తదితర అన్నిసంఘాల నేతలు హాజరు కావాలని మండల పార్టీ వైయస్సార్‌సీపీ నేతలు కోరుతున్నారు.

Back to Top