వైయస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం

విజయనగరంః నేడు మండల కేంద్రమైన జామిలో వైయస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర వైయస్సార్‌సీపీ ప్రధానకార్యదర్శి విజయసాయిరెడ్డి హాజరవుతున్నారు. స్థానిక వెంకటేశ్వర కళ్యాణ మండపంలో మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. ఈ సమావేశానికి ఉత్తరాంధ్ర కన్వీనర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా పార్టీ అధ్యక్షులు  బెల్లాన చంద్రశేఖర్, జిల్లా పార్టీ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు తదితరపెద్దలు హాజరవుతున్నారు. ఈ సమాశేశానికి వైయస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, యువజనసంఘాలు, మహిళాసంఘాలు, రైతుసంఘాలు, విద్యార్ధిసంఘాలు, తదితర అన్నిసంఘాలనేతలు హజరుకావాలని మండల పార్టీ వైయస్సార్‌సీపీ నేతలు పిలుపునిచ్చారు. 

Back to Top