నవరత్నాలపై గ్రామాల్లో విస్తృత ప్రచారం

తురకలాపట్నం(రొద్దం): మండలంలోని తురకలాపట్నం,రాచూరు,సానిపల్లి,పి.రొప్పాల,కలిపి,శేషాపురం,దొడగట్ట,రొద్దం పాత దళిత వాడ తదితర గ్రామాల్లో వైయస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 70 కుటుంబాలతో సభ్యత్వం చేయించారు. నవరత్నాల పథకాలపై గ్రామాల్లో ప్రజలకు వివరించారు. ప్రతి ఒక్కరు వైయస్‌ఆర్‌ కుటుంబంలో చేరాలని కోరారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ బి.నారాయణరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి చంద్రశేఖర్, సింగిల్‌ విండో డైరెక్టర్‌ మారుతిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు రాజారెడ్డి, మంజుస్వామి, మండల కమిటీ సభ్యులు పోలేపల్లి సంజీవప్ప,అమిర్,సినిమా నారాయణ,తిమ్మయ్య, ఆర్‌కే శ్రీరామిరెడ్డి,నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తాడిపత్రిలో వైయస్‌ఆర్ కుటుంబం సభ్యత్వ నమోదు
తాడిపత్రి టౌన్‌: తాడిపత్రి పట్టణంలోని సీపీఐ కాలనీ, నంద్యాల రోడ్డులో శనివారం వైయస్‌ఆర్ కుటుంబంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఇంటింటికి వెళ్లి దివంగత నేత పాలన, ప్రవేశ పెట్టిన పథకాలు వాటి అమలు గురించి వివరించారు. అనంతరం యువనేత జగన్‌ ముఖ్యమంత్రి కాగానే చేపట్టనున్న సంక్షేమ పథకాలపై వివరించారు. ఆ తరువాత ఆ కుటుంబ సభ్యులను పార్టీలో సభ్యత్వం చేయించారు. ఈకార్యక్రమంలో స్టీరింగ్‌ కమిటీ సభ్యడు గౌతమినాగిరెడ్డి, నియోజకవర్గ యువజన అధ్యక్షుడు బాణా నాగేశ్వరరెడ్డి, నాయకులు రంగనాథరెడ్డి, రాజా, బాబు, అప్పా లక్ష్మీనారాయణ ,రవి తోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top