నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి


బీజేపీతో టీడీపీకి ఇంకా సంబంధాలున్నాయి
రాజీనామా చేసిన వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
ప్రకాశం: అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రాజీనామా చేసిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రకాశం జిల్లాలో పంట నష్టాన్ని వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ నేతలు దళారులుగా మారి కంది రైతులను దోచుకుతింటున్నారని మండిపడ్డారు. జిల్లాలో రైతుల వద్ద కందులను ప్ర భుత్వం కొనుగోలు చేయాలని, శనగ రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందిన రెండు కుటుంబాలకు పరిహారం చెల్లించాలని కోరారు. 
రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్న ఏకైక పార్టీ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీపై దుష్ప్రచారం చేస్తుందని, టీడీపీ విష ప్రచారం ప్రజలకు కొత్తేమీ కాదని చెప్పారు. బీజేపీతో తెగదెంపులు చేసుకున్నామని చెబుతున్న తెలుగుదేశం పార్టీకి ఇంకా సంబంధాలున్నాయన్నారు. మహారాష్ట్రకు చెందిన బీజేపీ మంత్రి భార్యను టీటీడీ బోర్డు మెంబర్‌ను చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. 
Back to Top