వైఎస్ జగన్ కు అపూర్వ స్వాగతం

 గుంటూరు) గుంటూరు జిల్లా
మాచర్ల లో ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ కు పార్టీశ్రేణులు, అభిమానులు
అపూర్వ స్వాగతం పలికారు. మాచర్ల పట్టణం వీదులన్నీ జనంతో పోటెత్తాయి. జై జగన్, జై
వైఎస్సార్సీపీ అంటూ నినాదాలు హోరెత్తాయి. ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్నారెడ్డి
వైఎస్ జగన్ వెంటన ఖాళీ బిందె తలపై ఉంచి ర్యాలీగా సాగారు. అభిమానుల కోరిక మీద వాహనం
నుంచి బయటకు వచ్చిన వైఎస్ జగన్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఖాళీ బిందెను
చేత ధరించి వినూత్న రీతిలో నిరసన తెలిపారు.

 

Back to Top