వైయస్‌ఆర్‌సీపీలోకి మాజీ జడ్పీటీసీ తిరుపతి నాయుడు

విజయనగరంః వైయస్‌ఆర్‌సీపీలోకి భారీగా వలసలు పెరుగుతున్నాయి.వెయస్‌ జగన్‌ సమక్షంలో ఎమ్మెల్యే రాజన్నదొర ఆధ్వర్యంలో  మాజీ జడ్పీటీసీ రెడ్డి తిరుపతినాయుడుతో పాటు 45 మంది మండల స్థాయి ప్రజాప్రతినిధులు పార్టీలోకి చేరారు. వారిని వైయస్‌ జగన్‌ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజన్న దొర మాట్లాడుతూ విజయనగరం జిల్లాకు చంద్రబాబు ఇచ్చిన ఒక హామీ కూడా నెరవేర్చలేదని ఆరోపించారు.విషజ్వరాలతో జిల్లా ప్రజలు అల్లాడుతున్నా పట్టించుకోవడంలేదని, గిరిజన ప్రాంతంలో ఎమ్మెల్యేలకు నలుగురు గన్‌మెన్‌లు ఉంటారని, నాకు ఇద్దరు గన్‌మెన్‌లనే  కేటాయించారన్నారు.విపక్ష నేతల భద్రతను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు.
Back to Top