వైయస్‌ఆర్‌సీపీలోకి మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి


విజయవాడ: కృష్ణా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఈ నెల 14న ప్రజా సంకల్ప యాత్ర కృష్ణా జిల్లాలోకి ప్రవేశించే సమయంలో ఆయన వైయస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. శుక్రవారం రవి మీడియాతో మాట్లాడుతూ..టీడీపీ మంత్రులు తనను కించపరిచే విధంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు.  రైతు గర్జన సమయంలో కూడా మమ్మల్ని ఉపయోగించుకున్నారన్నారు. మాకు సీటు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు మోసం చేశారని రవి మండిపడ్డారు. టీడీపీలో తనకు గౌరవం లేదని, వైయస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఆకర్శితుడనై వైయస్‌ఆర్‌సీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. వైయస్‌ జగన్‌ మాటకు కట్టుబడే వ్యక్తి అన్నారు. వైయస్‌ జగన్‌ నాయకత్వంలో పని చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని రవి వెల్లడించారు. ఆయనతో పాటు పెద్ద ఎత్తున రవి అనుచరులు కూడా వైయస్‌ఆర్‌సీపీలో చేరనున్నారు.
 
Back to Top