మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డి వైయస్‌ఆర్‌సీపీలో చేరిక


తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రకు ఆకర్శితులవుతున్న వివిధ పార్టీల నాయకులు వైయస్‌ఆర్‌సీపీలో చేరుతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డి వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. ఆయనకు వైయస్‌ జగన్‌ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా తేతలి రామారెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుందన్నారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే రాజన్న రాజ్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. రామారెడ్డితో పాటు ఆయన అనుచరులు, వివిధ పార్టీల నాయకులు వైయస్‌ఆర్‌సీపీలో చేరారు.
 

తాజా ఫోటోలు

Back to Top