బాబు రైతు ద్రోహి

* మ‌హానేత వైయ‌స్ఆర్ ల‌క్ష‌ల ఎక‌రాలు పేద‌ల‌కు పంచారు
* బాబు పేద‌ల భూములు లాక్కుంటున్నారు
* వైయ‌స్ఆర్ హ‌యాంలో ఉద‌య‌గిరిలో 40 వేల ఇళ్లు ఇచ్చాం
* వైయ‌స్ జ‌గ‌న్ తండ్రిని మించిన త‌న‌యుడు అనిపించుకోవ‌డం ఖాయం
నెల్లూరు:  దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పేద‌ల‌కు ల‌క్ష‌ల ఎక‌రాలు భూమిని పంచితే చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చాక పేద‌ల భూములు లాక్కుంటూ వాళ్ల పొట్ట‌పై కొడుతున్నార‌ని ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి అన్నారు. ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా నెల్లూరు జిల్లా, ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గం క‌లిగిరిలో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నిక‌ల ముందు 600ల‌కు పైగా హామీలు ఇచ్చి ఏ ఒక్క‌టీ నెర‌వేర్చ‌కుండా ప్ర‌జ‌ల‌ను మోసం చేశార‌ని మండిప‌డ్డారు. రాజ‌ధాని పేరుతో వేల ఎక‌రాలు పేద‌ల భూములు లాక్కుని త‌న ఖ‌జానాను నింపుకుంటున్నార‌న్నారు. గ‌డిచిన నాలుగేళ్ల‌లో బాబు పాల‌న‌లో ఏ ఒక్క‌రూ సంతోషంగా లేర‌ని చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి పేర్కొన్నారు. ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ఎక్క‌డ వేసిన గొంగ‌లి అక్క‌డే అన్న చందంగా త‌యారైంద‌న్నారు. మ‌న నియోజ‌క‌వ‌ర్గంలో మ‌ళ్లీ అభివృద్ధి జ‌ర‌గాల‌న్నా... పేద ప్ర‌జ‌ల‌కు న్యాయం జ‌ర‌గాల‌న్నా మ‌న  నాయ‌కుడు వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయితేనే సాధ్య‌మ‌న్నారు. మ‌న నాయ‌కుడు జ‌గ‌న్ సీఎం అయితే ఇక్క‌డ ఉన్న వెలిగొండ ప్రాజెక్టును పూర్తి  చేయ‌డంతో పాటు వింజ‌మూరు ప‌ట్ట‌ణానికి ఉన్ననీటి స‌మ‌స్య‌ను తీర్చ‌మ‌ని కోరుతామ‌న్నారు. ఉద‌య‌గిరి చాలా వెనుక‌బ‌డిన నియోజ‌క‌వ్గంమ‌ని, ఇక్క‌డ చాలా మంది వ‌ల‌స‌లు వెళ్తున్నార‌న్నారు. ఈ ఉద‌య‌గిరిని టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేయాల‌ని వైయ‌స్ జ‌గ‌న్‌ను కోరారు. అంతేకాకుండా ఉద‌య‌గిరిలో స్మాల్‌స్కేల్ ఇండ‌స్ట్రీని ఏర్పాటు చేయాల‌ని కోరారు. వైయ‌స్ కుటుంబం మాట ఇస్తే త‌ప్ప‌ద‌ని, తాము కోరిన ఈ ప‌నులు జ‌గ‌న్ సీఎం కాగానే ప‌రిష్కార‌మ‌వుతాయ‌ని ఆశిస్తున్నామ‌ని చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ఆశాభావం వ్య‌క్తం చేశారు.  
Back to Top