వైయ‌స్ఆర్‌సీపీకి అండ‌గా ఉంటాచిత్తూరు: తంబళ్లపల్లె నియోజకవర్గం లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే కలిచెర్ల ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. తంబళ్లపల్లె మండలంలో నిర్వహించిన ప్రజా సంకల్పయాత్రలో పాల్గొన్న ఆయన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, సమన్వయకర్త పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డితో కలిసి వసంతాపురం విడిది కేంద్రంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డిని కలి శారు. ఈ సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డి కలిచెర్లకు కుశల ప్రశ్నలు వేశారు. పార్టీకి అండగా నిలవాలని కోరగా అందుకు సమ్మతించారు. కలిచెర్ల దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకున్నారు. సీఎంగా రాజశేఖరరెడ్డి తంబళ్లపల్లెలో పర్యటించి అభివృద్ధి పనులు చేయించారని అన్నారు. ‘నాన్నలాగే మీరూ ముఖ్యమంత్రిగా ఇక్కడ పర్యటించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయా లి’ అని వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డిని ప్ర‌భాక‌ర్‌రెడ్డి కోరారు. చంద్ర‌బాబు నాలుగేళ్ల పాల‌న‌లో ఏ ఒక్క వ‌ర్గం కూడా సంతోషంగా లేద‌ని, వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్య‌మ‌వుతుంద‌ని క‌లిచెర్ల పేర్కొన్నారు. 

Back to Top