రాష్ట్రం అట్టుడికిపోతుంటే నోరు విప్పరేం?

విజయవాడ, 26 ఆగస్టు 2013:

విభజన విషయంలో రాష్ట్రం అట్టుడికిపోతుంటే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నోరు ఎందుకు మెదపడంలేదని పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌ నిలదీశారు. ఒకవేళ రాష్టం విడిపోవాల్సిన పరిస్థితే వస్తే వారిద్దరూ తెలంగాణలో ఉంటారా లేక సీమాంధ్రలోనా అని ఆయన వ్యాఖ్యానించారు. ‌కృష్ణా జిల్లా మైలవరంలో తాను చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షా శిబిరంలో సోమవారంనాడు మీడియాతో మాట్లాడారు.

జైలులో ఉన్నప్పటికీ శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి ప్రజల పక్షాన నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు సీమాంధ్రలోని టిడిపి, కాంగ్రెస్ ‌నాయకులు ఉద్యమం ఎందుకు చేయడంలేదని జోగి రమేష్ ‌ప్రశ్నించారు. వైయస్ఆ‌ర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి ఆదివారం‌ ఉదయం చంచల్గూడ జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. శ్రీ జగన్కు మద్దతుగా కృష్ణాజిల్లాలోని మైలవరంలో జోగి రమే‌ష్ ఆమరణ ‌నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సోమవారం దీక్షా శిబిరంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నలకు జోగి రమేష్ పై విధంగా సమాధానం ఇచ్చారు.

Back to Top