సీమ అంటే బాబుకు చిన్నచూపు


కర్నూలు: ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాయలసీమ అంటే చిన్నచూపు అని మాజీ ఎమ్మెల్యే ఎ్రరకోట చెన్నకేశవరెడ్డి విమర్శించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గోనెగండ్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఇవాళ మన ప్రియతమ నాయకుడు వైయస్‌ జగన్‌ ఎమ్మిగనూరు నియోజకవర్గానికి రావడం సంతోషకరం. మన కొరకు, మన బాగు కోసం పాదయాత్రగా వచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌రాజశేఖరరెడ్డి మాదిరిగానే వైయస్‌ జగన్‌ కూడా ప్రజల కోసం నిత్యం ఆలోచిస్తున్నారు. చంద్రబాబు వచ్చాక 108, 104 వంటి పథకాలు అన్ని కూడా నిర్వీర్యం అయ్యాయి. ఇవాళ సంక్షేమ పథకాలు పచ్చ చొక్కాలకే  పరిమితమయ్యాయి. వైయస్‌ఆర్‌ పాలనలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందేవన్నారు. నియోజకవర్గంలో సాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. కర్నాటక రాష్ట్రం మన వాటను కూడా వాడుకుంటోంది. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ సమస్య పరిష్కారం కోసం వైయస్‌ఆర్‌ పులికనుమ ప్రాజెక్టుకు అనుమతించారన్నారు. ఇవాళ చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు గండి కొట్టి రైతులకు అన్యాయం చేశారు. రాయలసీమ అంటే చంద్రబాబుకు చిన్నచూపు ఉంది. ఆయనకు ఎంతసేపు ఉన్నా విజయవాడ, గోదావరి జిల్లాలను అభివృద్ధి చేస్తున్నారు. వైయస్‌ జగన్‌ సీఎం కాగానే మన పులికనుమ ప్రాజెక్టును పూర్తి చేసి రైతులను ఆదుకుంటారన్నారు. గాజులదిన్నె ప్రాజెక్టుకు హంద్రీనీవా నీళ్లు ఇవ్వాలన్న ప్రతిపాదన ఉండేదన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఈ ప్రతిపాదనను బుట్టదాఖలు చేశారని విమర్శించారు. కలెక్టర్‌ దయాబిక్ష వల్ల మనకు నీళ్లు వదులుతున్నారని చెప్పారు. మనకు హంద్రీనీవా నుంచి 3 టీఎంసీల నీరు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని వైయస్‌ జగన్‌ను కోరుతున్నాను. వచ్చే ఎన్నికల్లో వైయస్‌ జగన్‌కు అండదండలు అందించాల్సిన అవసరం ఉందని కోరారు.
 
Back to Top