బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే వైయస్‌ఆర్‌సీపీలో చేరిక

 
పశ్చిమ గోదావరి:  వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రను చూసి పలువురు నేతలు వైయస్‌ఆర్‌సీపీలోకి ఆకర్శితులు అవుతున్నారు. శుక్రవారం బొబ్బలి మాజీ ఎమ్మెలే శంబంగి చిన్న అప్పలనాయుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. పార్టీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ నేతృత్వంలో అప్పలనాయుడు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో వైయస్‌ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అలాగు బొబ్బిలికి చెందిన సౌమ్య, తదితరులు వైయస్‌ఆర్‌సీపీలో చేరారు.
 
Back to Top