వైయస్ఆర్ కాంగ్రెస్‌లో చేరిన అల్లూరి కృష్ణంరాజు

హైదరాబాద్‌, 30 సెప్టెంబర్ 2013:

తూర్పు గోదావరి జిల్లా రాజోలు మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజు సోమవారం ఉదయం వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌లో చేరారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.‌ లోటస్‌పాండ్‌లోని క్యాంపు కార్యాలయంలో ఉదయం జరిగిన కార్యక్రమంలో అల్లూరి కృష్ణంరాజుకు పార్టీ కండువా కప్పి శ్రీ జగన్‌ ఆహ్వానించారు. ఈ సందర్భంగా అల్లూరి కృష్ణంరాజు మాట్లాడుతూ.. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని మరింతగా బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు.

Back to Top