మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ వైయస్‌ఆర్‌సీపీలో చేరిక

గుంటూరు: ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం ఉండవల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో 3 వేల మంది అనుచరులతో కలిసి సతీష్‌ వైయస్‌ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు వైయస్‌ జగన్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సతీష్‌ మాట్లాడుతూ..ప్రత్యేక హోదా సాధించగలిగిన నాయకుడు వైయస్‌ జగన్‌ అన్నారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. 
 
Back to Top