జననేతకే ప్రజల పట్టాభిషేకం

ప్రజల కన్నీరు తుడిచే నేత వైయస్‌ జగనే..
మాజీ సీఎం దివంగత నేదురుమల్లి తనయుడు రామ్‌కుమార్‌
విశాఖ జిల్లాః టీడీపీ పాలనలో  ప్రజలు తీవ్రంగా మోసపోయారని నేదురుమల్లి రామ్‌కుమార్‌ అన్నారు. వైయస్‌ జగన్‌ సమక్షంలో 3వేల మందితో వైయస్‌ఆర్‌సీపీలోకి చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. నాలుగున్నర సంవత్సరాల కాలంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని మళ్లీ జగన్‌ నాయకత్వంలో రాష్ట్రానికి మంచిరోజుల వస్తాయన్నారు.వైయస్‌ జగన్‌పై పూర్తి విశ్వాసం ఉందని ఆయన సారధ్యంలో ఆంధ్ర అభివృద్ధి చెందుతుందన్నారు. అన్నివర్గాల ప్రజలు జగన్‌కు తమ సమస్యలు వివరించి జగనన్న భరోసా లభించిందనే నమ్మకంతో సంతోషంగా వెళ్తుతున్నారన్నారు. ప్రజా సంకల్పయాత్రలో ప్రజల కష్టాలు, సమస్యలను జగన్‌ నిండు మనసుతో వింటూ సానుకూలంగా స్పందిస్తున్నారన్నారు. ఖచ్చితంగా ప్రజలు ఆయనకే పట్టాభిషేకం చేస్తారన్నారు. 


Back to Top