ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలి

నందిగామ రూరల్ః రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ మొండితోక జగన్‌మోహనరావు పేర్కొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం పార్టీ పట్టణ సమన్వయ కమిటీ నియామకం జరిగింది. ఈ సందర్భంగా జగన్‌మోహనరావు మాట్లాడుతూ... నందిగామ పట్టణంలో మాదిరిగానే నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్ళి వారి సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా ప్రతి ఒక్కరూ సిద్దంగా ఉండాలన్నారు. 

సమన్వయ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అధికార పార్టీ సాగిస్తున్న ప్రజావ్యతిరేక పాలనను ప్రజల్లోకి పూర్తి స్థాయిలో తీసుకెళ్ళేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల పక్షాన పోరాడేందుకు ఏ క్షణమైన పార్టీ సిద్దంగా ఉందని గుర్తు చేశారు. ఇప్పటికే గడపగడపకు వైయస్‌ఆర్‌ కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు వెళ్ళి వారి సమస్యలు తెలుసుకోవటంతో పాటు ఎన్నికల ముందు ప్రజలకు చంద్రబాబు ఇచ్చిన హామీలను, మరిచిన తీరును వివరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి మండలానికి 15 మంది సభ్యులతో కూడిన సమన్వయ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

నందిగామ పట్టణ సమన్వయ కమిటీ సభ్యుల ఎన్నిక
నందిగామ పట్టణ సమన్వయ కమిటీ సభ్యులుగా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్‌ మొండితోక అరుణ్‌కుమార్‌తో పాటు కోవెలమూడి వెంకట నారాయణ, చల్లా బ్రహ్మేశ్వరరావు(బ్రహ్మం), మంగునూరు కొండారెడ్డి, నెలకుదిటి శివనాగేశ్వరరావు, చిరుమామిళ్ళ చైతన్యకుమార్, మహ్మద్‌ మస్తాన్, పాములపాటి రమేష్, కత్తురోజు శ్రీనివాసాచారి, పత్తిపాటి జయరామారావు, గుడివాడ సాంబశివరావు, మువ్వల శ్రీనివాసరావు, ఖలీల్‌ అహ్మద్‌ రజ్వీ, కుక్కల సత్యనారాయణప్రసాద్, తోట అంజారావు, బేరోతుల బాబులను నియమించినట్లు జగన్‌మోహనరావు తెలిపారు.
 
 
Back to Top