ప్రతి ఒక్కరు సైనికుల్లా పనిచేయాలి

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
గుంటూరు: ప్రతి ఒక్కరు సైనికుల్లా పనిచేసి వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడదామని పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. మంగళవారం గుంటూరు జిల్లాలోని పార్టీ కార్యాలయంలో  జిల్లా సేవాదళ్‌ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా అంబటి రాంబాబు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మ్రరి రాజశేఖర్, లేళ్ల ఆప్పిరెడ్డి, మేరుగు నాగార్జున, రావి వెంకటరమణ, కత్తెర సురేష్, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, సేవాదళ్‌ జిల్లా కమిటీ సభ్యులు–స్టేట్‌ సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో  నాయకులు మాట్లాడుతూ జిల్లా సేవాదళ్‌ భవిష్యత్తు కార్యాచరణ, మండల– గ్రామం సేవాదళ్‌ కమిటీలను ఏర్పాటుపై సలహాలు, సూచనలు ఇచ్చారు.
Back to Top