ప్రతి ఒక్కరినీ వైయస్ఆర్ కుటుంబంలో చేర్పించాలి

ఆ బాధ్యత బూత్‌ కమిటీ సభ్యులు, కార్యకర్తలదే..
వైయస్సార్‌ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత బాబు

రాజవొమ్మంగి: ప్రతి ఒక్కరినీ వైయస్సార్‌ కుటుంబంలో చేర్పించే బాధ్యతను పార్టీ కార్యకర్తలు, బూత్‌లెవెల్‌ కమిటీ సభ్యులు తీసుకోవాలని జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు, రంపచోడవరం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు అనంత ఉదయ్‌ భాస్కర్‌ కోరారు. శరభవరం పంచాయతీ వణకరాయిలో శనివారం వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. అంతకు ముందు కార్యకర్తలతో మాట్లాడుతూ ప్రతి బూత్‌ కమిటీ సభ్యుడు 50 మంది చేత సభ్యత్వం నమోదు చేయించి వారికి రసీదులు ఇవ్వాలని కోరారు. అలాగే వారి చేత 91210 91210 నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇప్పించాలని సూచించారు. వైయస్సార్‌ కుటుంబంలో చేరిన వారికి జగన్‌మోహనరెడ్డి వాయిస్‌కాల్‌ వస్తుందని అంతవరకు వేచి ఉండి వారికి నవరత్నాల పథకాల గురించి కూడా వివరించాల్సిన బాధ్యత బూత్‌లెవెల్‌ కమిటీ సభ్యులు తీసుకోవాలన్నారు. పార్టీ స్టిక్కర్‌ను డోర్‌పై అతికించాలని కోరారు. ఏదో మొక్కుబడిగా కార్యక్రమాల్లో పాల్గొనవద్దన్నారు. సెప్టెంబర్‌ నెలాఖరు వరకూ ఈ కార్యక్రమంలో ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిందా అని ప్రశ్నించారు. ప్రశ్నావళిని పూర్తిచేయించారు. వైయస్‌ జగన్‌మోహనరెడ్డి అధికారంలోకి రాగానే పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం రూపొందించిన తొమ్మిది సంక్షేమ పథకాలను (నవరత్నాలను ) వివరించారు. వణకరాయిలో 45, శరభవరం కాలనీలో 20, చినదాకరాయి (బాలసవీధిలో) మరో 20 గడపలకు వెళ్లి సభ్యత్వం నమోదు చేశారు. వైయస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ సింగిరెడ్డి రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి దాట్ల వేంకటేష్‌రాజు, మెంబర్‌ నక్కా మోహన్, నేతలు చప్పా నూకరాజు, నాగులాపల్లి కుశరాజు, కొంగర మురళీకృష్ణ, బంటుపల్లి చంద్రరావు, చీడి శివ, చీడిపల్లి శాంతకుమారి, అడపా కామేష్, దాసరి నాగేశ్వరరావు, పిల్లి కిరణ్, పోసిన అప్పారావు, మంతెన ముసలయ్య, అధికారి సత్యనారాయణ, నూకరాజు, గొల్లపల్లి శ్రీను, జీవా, కనిగిరి రాజబాబు, సూర్యనారాయణ, ముప్పన మోహన్‌కుమార్, బూత్‌లెవెల్‌ కమిటీ సభ్యులు కుంజం అప్పారావు, ముర్ల రత్నం, పండు, గమ్మెల కాంతారావు, కొర్ర బిస్సు, లోతా రామరాజు ,పెద్ద ఎత్తున కార్యకర్తలు, గిరిజన మహిళలు పాల్గొన్నారు.

Back to Top